శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గూనబద్ర కాలనీ వద్ద వంశధార రిజర్వాయరు వరదకాల్వ పనులను బుధవారం ఉదయం స్థానికులు అడ్డుకున్నారు.
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గూనబద్ర కాలనీ వద్ద వంశధార రిజర్వాయరు వరదకాల్వ పనులను బుధవారం ఉదయం స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తమ కాలనీని ముంపు ప్రాంతంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ గ్రామస్తులతో చర్చించారు. ఇంజనీరింగ్ అధికారులతో సర్వే చేయించి ముంపు ప్రాంతం అని తేలితే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు.