ప్యాకేజీకి కేబినెట్‌ నోట్‌ తయారుకాలేదు | The package can be made to the Cabinet note | Sakshi
Sakshi News home page

ప్యాకేజీకి కేబినెట్‌ నోట్‌ తయారుకాలేదు

Published Wed, Feb 8 2017 2:52 AM | Last Updated on Mon, Aug 20 2018 7:17 PM

ప్యాకేజీకి కేబినెట్‌ నోట్‌ తయారుకాలేదు - Sakshi

ప్యాకేజీకి కేబినెట్‌ నోట్‌ తయారుకాలేదు

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

హైదరాబాద్‌: ఏపీకి  కేంద్రం ప్రకటించిన ప్రత్యేక అభి వృద్ధి సహాయం (ఆర్థిక ప్యాకేజీ)కు సంబంధించిన కేబినెట్‌ నోట్‌ను ఇంకా రూపొందించే స్థాయిలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ తెలి పారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్యాకేజీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిందా? ఆమోదంలో జాప్యానికి కారణాలున్నాయా? విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం పనులు కూడా ఈ ప్యాకేజీలోకి వస్తాయా? అని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపర్చి ఉన్నాయి కనుక అవి ప్రత్యేక ప్యాకేజీలో అంతర్భాగం కావని మంత్రి మేఘ్వాల్‌ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement