సాక్షి ప్రతినిధి, తిరుపతి: పోలీసు శాఖలో బదిలీలకు ప్రభుత్వం తెరలేపింది. తొలుత డీఎస్సీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పి స్తూ బదిలీలు చేసింది. ఏఎస్పీ కేడర్‌లో పనిచేస్తున్న అధికారులకూ స్థానచలనం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ.ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఎస్పీ గా పనిచేస్తున్న వై.రవిశంకర్‌రెడ్డిని తూర్పుగోదావరిజిల్లా ఏఎ స్పీ(ఆపరేషన్స్)గా బదిలీ చేశారు.
తిరుపతిలో ఓఎస్డీ గా పనిచేస్తున్న ఎస్.రాజశేఖరరావును జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఎస్పీగా నియమించారు. తిరుమల ఓఎస్డీగా పనిచేస్తున్న డీ.సిద్ధారెడ్డికి ఏఎస్పీగా పదోన్నతి కల్పించారు. ఆయనను రాజమండ్రి అర్బన్ ఏఎస్పీ(పరిపాలన)గా నియమించారు. తిరుమల ఏఎస్పీగా ఎంవీఎస్ స్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
డీఎస్పీ వీ.సుబ్బారెడ్డికి ఏఎస్పీగా పదోన్నతి కల్పించారు. ఆయనను తిరుపతి ఏఎస్పీ(క్రైం విభాగం)గా నియమించారు. చిత్తూరు డీఎస్పీగా పనిచేస్తున్న బి.కమలాకర్‌రెడ్డికి ఏఎస్పీగా పదోన్నతి కల్పించి ఏపీఎస్ ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. డీఎస్పీ ఎస్.త్రిమూర్తులుకు ఏఎస్పీగా పదోన్నతి కల్పించి తిరుపతి అర్బన్ ఏఎస్పీ (పరిపాలన)గా నియమించారు.
పోలీసు శాఖలో బదిలీలు
Published Sat, Aug 23 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
Advertisement
Advertisement