వీపనగండ్ల, న్యూస్‌లైన్: కరెంట్ కోతలపై అన్నదాతలు ఆగ్రహం వ్య క్తం చేశారు. మూడు రో జులుగా పైర్లకు ఏడు గంటల విద్యుత్ అందకపోవడంతో శుక్రవారం వీపనగండ్ల సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆపరేటర్‌ను గదిలో దిగ్బం ధించి తాళం వేశారు. సబ్‌స్టేషన్ ఎ దుటే వంటావార్పు నిర్వహించా రు. స్థానిక 33/11కేవీ సబ్‌స్టేషన్ నుంచి తూంకుంట, వెలగొండ, ద గడపల్లి, గూడెం ఫీడర్లకు విడతల వారీగా ఒక్కో ఫీడర్‌కు ఏడు గంట ల విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. ఎల్‌వీ1లో చార్జర్‌లు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోరుుంది. మూడు గంటలు మాత్రమే కరెంట్ సరఫరా అవుతోంది. ఫోన్ ద్వారా ఏఈ నర్సింహకు రైతులు విద్యుత్ సమస్యను అనేక సార్లు విన్నవించినా.. పట్టించుకోలేదు. దీంతో రైతు లు ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కాంట్రాక్టర్ చేత పనులు చేరుుస్తానని.. ఏఈ వచ్చి హామీ ఇచ్చే వరకు కదలలేదు. కార్యక్రమంలో రైతులు ఎత్తం కృష్ణయ్య, రవిందర్‌రెడ్డి, సూర్యనారాయణ, ధర్మారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, గోవిందు, వెంకటేశ్వర్లు, తుప్పలయ్య, బాలపీర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
లైన్‌మన్ నిర్బంధం
సల్కరపేట(బిజినేపల్లి): అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా సల్కరపేట గ్రామ రైతులు గ్రామ పం చాయతీ కార్యాలయంలో లైన్‌మన్‌ను నిర్బంధించా రు. అలాగే కార్యాలయం ఎ దుట బైఠారుుంచారు. వ్యవసాయానికి నాలుగ్గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు గోవిందచారి, రాములు, తిర్పతయ్య, శ్రీశై లం, నర్సింహ్మ, వెంకటయ్య, నాగయ్య, సుధాకర్ ఆరోపించారు. వేసవి కాలం రాకముందే గ్రామంలో పంటలు ఎండిపోతున్నాయని, సబ్‌స్టేషన్‌లో పనిచేసే ఆపరేటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉదయం ఎని మిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకు బంధించడంతో ఏఈ శ్రీరాం ఫోన్లో రైతులతో మాట్లాడి వారంరోజుల్లో వి ద్యుత్ అంతరాయాన్ని సరిచేస్తామని హామీ ఇచ్చారు. లైన్‌మెన్‌ను వదిలిపెట్టారు.
కరెంట్ కోతలపై కన్నెర్ర
Published Sat, Dec 14 2013 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement