ఏమిటీ ఘోరం
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: తెలంగాణ నోట్ ఆమోదంతో జిల్లా భగ్గుమంది. నోట్‌కు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపడంతో ప్రజలు మం డిపడ్డారు. రెండు నెలలపాటు చేపట్టిన సీమాం ధ్ర ఉద్యమాన్ని లెక్కచేయకుండా మంత్రివర్గం ముందుకెళ్లడంపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డా యి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. గాజువాకలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. భీమిలిలో బంద్ పాటించారు.
48 గంటల బంద్
కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జీవో లు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. జాతీయ రహదారుల దిగ్బంధం, కేంద్ర ప్రభు త్వ కార్యాలయాలు, బ్యాంకుల మూసివేతకు సన్నద్ధమవుతున్నారు. వీరి ఆందోళనకు అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. గురువారం నుంచి మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర సేవ లు మినహా మిగిలిన వైద్య సేవలన్నీ నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం నిర్ణయించింది. సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి. రామ్మోహన్, కార్యదర్శి డాక్టర్ పి.శ్యాం సుం దర్ ఈ విషయాన్ని ప్రకటించారు. నర్సులు, నాలుగో తరగతి సిబ్బంది కూడా విధులు బహిష్కరించి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలని తీర్మానించారు.
బందోబస్తు
టీనోట్‌పై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవచ్చనే ఆలోచనతో పోలీసువర్గాలు అప్రమత్తమయ్యా యి. ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద గురువారం రాత్రి నుంచి అదనపు బలగాలను మోహరిం చాయి. గత రెండు నెలలుగా ఉన్న బలగాలకు అదనంగా మరిన్ని కేంద్ర బలగాలు విశాఖకు చేరుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాల యాలు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
ప్రైవేట్ స్కూళ్ల బంద్
ఆరిలోవ: తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలపడంతో నిరసనగా విశాఖ జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థలు 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్ర, శనివారాలు స్వచ్ఛందంగా జిల్లాలోని ప్రై వేటుపాఠశాలన్నీ మూసివేయాలని జిల్లా ప్రైవే టు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వి.రావు ఒక ప్రకటనలో కోరారు.