పరిగి, న్యూస్‌లైన్: పరిగి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అగవ్యుగోచరంగా తయూరైంది. గత రెండేళ్లుగా పార్టీ పరిగి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగిన ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. నరేందర్‌రెడ్డి పార్టీని వీడాక రెండుసార్లు పరిగి టీడీపీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమైనప్పటికీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిని కూడా నియుమించలేదు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అదునుగా భావించిన ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి వర్గం టీడీపీని ఖాళీ చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఆయా మండలాలకు చెందిన పలువురు నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా చేసిన దోమ మండలానికి చెం దిన పలువురు కీలక నేతలు సైకిల్‌దిగి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఒకటిరెండు రోజుల్లో కారులో వారికి బెర్తులు ఖాయువువనున్నట్లు తెలుస్తోంది.
నానాటికి తీసికట్టుగా..
గత 20 సంవత్సరాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి పార్టీ వీడటంతో కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత నరేందర్‌రెడ్డికి పార్టీ నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. దీంతో ఆయున పార్టీకి కొత్త ఊపిరి పోస్తారని కార్యకర్తలు ఆశించారు. కాని ఆయన ఆ దిశగా పార్టీని నడిపించలేక పోయారు. నియోజకవర్గంలో నానాటికి టీడీపీ పరిస్థితి ఘోరంగా తయూరవుతుండటంతో ఆయనే పార్టీని వీడారు. దీంతో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
అయోమయంలో పార్టీ శ్రేణులు
ఎన్నికల ముంగిట పార్టీ ఇన్‌చార్జి నరేందర్‌రెడ్డి టీడీపీని వీడటం.. 15 రోజులు దాటినా పార్టీకి ఇన్‌చార్జిని నియమించకపోవడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. స్థానిక సమరం సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీకి ఇన్‌చార్జి లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు తమతోనే ఉన్నారని ఆ పార్టీ అధినాయకత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులకు కూడా ఎవరిని సంప్రదించాలో అర్థంకావడంలేదు. పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ ఇన్‌చార్జి పగ్గాలు చేపట్టేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు.
సారథి లేని సైకిల్..!
Published Wed, Mar 12 2014 11:01 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement