కేంద్రం నిర్ణయంలో మార్పు ఉండదు:ఏఐసిసి | There is no change: AICC | Sakshi
Sakshi News home page

కేంద్రం నిర్ణయంలో మార్పు ఉండదు:ఏఐసిసి

Published Tue, Aug 6 2013 3:17 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

There is no change: AICC

హైదరాబాద్:  తెలంగాణపై కేంద్ర నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఏఐసీసీ పరిశీలకుడు తిరునావక్కరసు స్పష్టం చేశారు. విభజన అనంతరం సీమాంధ్రులకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితులను పరిశీలించేందుకే ఏఐసీసీ తరఫున తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు.

 ఏఐసీసీ కార్యదర్శి  తిరునావక్కరసు పరిశీలకుడుగా ఇక్కడకు వచ్చారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయన పరిశీలిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతిని గమనిస్తున్నారు. సీమాంధ్ర నేతలు  కూడా పలువురు ఆయనను కలిసి రాష్ట్రాన్ని విభజించవద్దని అధిష్టానంపై ఒత్తిడి తేవాలని కోరారు. తిరునావక్కరసు నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement