జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో డీబార్‌లకు బోణీ పడింది.
► ఒకే పరీక్ష కేంద్రంలో...
► ఇన్విజిలేటర్ తొలగింపు
విజయనగరం అర్బన్ : జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో డీబార్‌లకు బోణీ పడింది. ఇంత వరకు జరిగిన ఆరు రోజుల పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా ఒక్కరు కూడా పట్టుబడలేదు. శుక్రవారం ఒకే పరీక్ష కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు డీబార్ అయ్యారు. పార్వతీపురం డివిజన్ పరిధిలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల భద్రగిరిలో శుక్రవారం జరిగిన గణితం–2 పేపర్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీసు చేస్తున్న ఇద్దరు బాలురు, ఒక బాలిక పట్టుబడ్డారని డీఈవో ఎస్.అరుణకుమారి తెలిపారు. అదే పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలిగించామని పేర్కొన్నారు.
పరీక్షల నిర్వాహణలో స్క్వాడ్ సిబ్బంది బృందం 64 పరీక్ష కేంద్రాలను, 11 ప్రశ్నపత్రాల స్టోరేజీ పాయింట్‌లను ఆకస్మిక తనిఖీ చేశారని పేర్కొన్నారు.