వంతెన పనులను అడ్డుకుంటున్న ఎంపీ | thwart the work of the bridge Harsha Kumar MP | Sakshi
Sakshi News home page

వంతెన పనులను అడ్డుకుంటున్న ఎంపీ

Published Mon, Nov 4 2013 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

thwart the work of the bridge Harsha Kumar MP

 సఖినేటిపల్లి, న్యూస్‌లైన్ :సఖినేటిపల్లి, నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి నదిపై మంజూరైన వంతెన పనులను అమలాపురం ఎంపీ హర్షకుమార్ కావాలని పనిగట్టుకుని ఆపారని రాజోలు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు అల్లూరు కృష్ణంరాజు ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఆదివారం సఖినేటిపల్లిలో ఆయన స్వగృహంలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  సీఎం పర్యటన వల్ల ముంపు బాధిత కుటుంబాలకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. సీఎం బాధితులకు తగిన సాయం ప్రకటించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి హయాంలో ముంపు బాధితులకు వెంటనే సాయం అందజే సినట్టు ఆయన స్పష్టం చేశారు.
 
 జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడమే కిరణ్‌కుమార్ రెడ్డి పనిగాపెట్టుకున్నారని కృష్ణంరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు లోపాయికారిగా కుమ్మక్కయ్యారన్నారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను అడ్డుకుని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడుకు అనుమతివ్వడం దీనికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన వె ంటనే నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమంగా జగన్ చేతులుమీదుగా వంతెన పనులను ప్రారంభింపజేస్తామని ఆయన వెల్లడించారు. కేంద్రంలో వైఎస్సార్ సీపీ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నియోజకవర్గంలో సుమారు 45 వేల ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బతిందని, పలు కాలనీలు ఇప్పటికీ చెరువులుగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
 
 రైతులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. పార్టీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 29 కాలనీలను ముంపునీరు ముంచెత్తడం వల్ల 10వేల మంది నిరాశ్రయులయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వం బాధితులకు సాయం అందించలేదని ఆయన తెలిపారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కుచ్ఛర్లపాటి సూర్యనారాయణ రాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అల్లూరు రంగరాజు, మలికిపురం, మామిడికుదురు మండల శాఖల అధ్యక్షులు యెనుముల నారాయణస్వామి, బొలిశెట్టి భగవాన్, సఖినేటిపల్లి, మలికిపురం గ్రామ శాఖల అధ్యక్షులు నల్లి బాలరాజు, గంటా ప్రకాశరావు, చింతలమోరి సర్పంచ్ కారుపల్లి విజయమోహన్, గ్రామ మాజీ సర్పంచ్ బళ్ల నోబుల్ ప్రభాకర్, నాయకులు బెల్లంకొండ సూరిబాబు, గొల్ల చంటిబాబు, గెడ్డం తులసీభాస్కర్, అడబాల పద్మకేశవరావు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement