నీతివంతంగానే డబ్బు సంపాదించాలి-మంత్రి | To make money right way says Minister Sujana chowdary | Sakshi
Sakshi News home page

నీతివంతంగానే డబ్బు సంపాదించాలి-మంత్రి

Published Sat, Jun 10 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

నీతివంతంగానే డబ్బు సంపాదించాలి-మంత్రి

నీతివంతంగానే డబ్బు సంపాదించాలి-మంత్రి

ఢిల్లీ:  ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి పాల్లోని అవినీతి రహిత ఉద్యోగులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులకు అప్పులు ఎగవేసిన వారి నుంచి ఎలా వసూలు చేయాలన్న దానిపైన అధికారులకు సలహాలు ఇచ్చారు. చాలా బ్యాంకుల్లో  డిఫాల్డర్లు పెరుగుతున్నారని అన్నారు.  అప్పులు తీసుకున్న వారింటికి అధికారులు ఆదివారం వెళ్లాలని తెలిపారు.

టీ, కాఫీ ఇవ్వమని అడగి వారితో సానుకూలంగా మాట్లాడి వారి భాధ లేమిటో తెలుసుకోవాలన్నారు. ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో చూడాలని అధికారులకు చెప్పారు. అలాగైతే వసూళ్లు పెరుగుతాయని మంత్రి సూచించారు. ఇలా వినుత్న పద్దుతుల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ప్రభుత్వంతో వ్యాపారం చేయలేదని పేర్కొన్నారు. గజం ప్రభుత్వ స్థలం కూడా తీసుకోలేదన్నారు. డబ్బు సంపాదించడం జన్మహక్కు అయితే నీతివంతంగా సంపాదించాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement