నేడు వీఆర్‌వో, వీఆర్‌ఏ నోటిఫికేషన్ | Today notification,VRO,VRA posts | Sakshi
Sakshi News home page

నేడు వీఆర్‌వో, వీఆర్‌ఏ నోటిఫికేషన్

Published Sat, Dec 28 2013 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

నేడు వీఆర్‌వో, వీఆర్‌ఏ నోటిఫికేషన్

నేడు వీఆర్‌వో, వీఆర్‌ఏ నోటిఫికేషన్

=ఫిబ్రవరి 2న రాత పరీక్షలు
 =20న ఫలితాలు విడుదల
 =కలెక్టర్ ఆరోఖ్యరాజ్ వెల్లడి

 
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: వీఆర్‌వో, వీఆర్‌ఏ నియామక నోటిఫికేషన్ శ నివారం జారీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనవరి 12లోగా ఫీజు చెల్లించి, 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 19 నుంచి హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 2న ఉదయం వీఆర్‌వోలకు, మధ్యాహ్నం వీఆర్‌ఏలకు రాత పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. అదే నెల 4న ప్రాథమిక కీ, 10న తుది కీ వెలువడుతుందని చెప్పారు. 20న పరీక్షా ఫలితాలు ప్రకటించి, 26 నుంచి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలను నగరంలోనే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 50 కేంద్రాలు గుర్తించామన్నారు.

అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే డివిజన్ ప్రధాన కేంద్రాల్లో నిర్వహించేందుకు ప్రతిపాదిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం 1800-4250-0002 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయవచ్చు లేదా http://ccla.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement