కరీంనగర్ లో13న కేసీఆర్ బహిరంగసభ!
కరీంనగర్ లో13న కేసీఆర్ బహిరంగసభ!
Published Fri, Apr 11 2014 4:48 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
కరీంనగర్: కరీంనగర్ లో నిర్వహించే బహిరంగసభలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధినేత కే చంద్రశేఖరరావు (కేసీఆర్) పాల్గొంటారని పార్టీ వర్గాలు మీడియాకు సమాచారాన్ని అందించారు.
ఆదివారం ఏప్రిల్ 13 తేదిన స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే సభలో కేసీఆర్ ప్రసంగిస్తారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుగా నిర్వహించే ప్రచారంలో భారీఎత్తున ప్రజలు పాల్గొనేందుకు సిద్ధం చేస్తున్నామని పార్టీ వర్గాలు తెలిపాయి.
టీఆర్ఎస్ నుంచి కరీంనగర్ లోకసభ అభ్యర్థిగా బి వినోద్ కుమార్, అసెంబ్లీ స్థానం నుంచి గంగుల కమలాకర్ పోటీలో ఉన్నారు.
Advertisement
Advertisement