ఇద్దరు అటవీ బీట్ అధికారుల దారుణహత్య | Two forest Beat officers Brutal murder | Sakshi
Sakshi News home page

ఇద్దరు అటవీ బీట్ అధికారుల దారుణహత్య

Apr 10 2016 2:53 AM | Updated on Sep 3 2017 9:33 PM

ఇద్దరు అటవీ బీట్ అధికారుల దారుణహత్య

ఇద్దరు అటవీ బీట్ అధికారుల దారుణహత్య

కలప అక్రమ రవాణాదారులు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఇద్దరు అటవీశాఖ బీట్ అధికారులపై గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు.

గొడ్డళ్లతో నరికి చంపిన కలప దొంగలు

 బొల్లాపల్లి: కలప అక్రమ రవాణాదారులు రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న ఇద్దరు అటవీశాఖ బీట్ అధికారులపై గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం కనమలచెర్వు పంచాయతీ శివారు నెహ్రూనగర్ తండా సమీపంలోని పురుగులకుంట వద్ద శనివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. కలప అక్రమ రవాణాదారులు చెట్లను నరుకుతున్నారన్న సమాచారం మేరకు నాయుడుపాలెం, కండ్రిక బీట్ అధికారులు దిడ్ల లాజర్(44), షేక్ బాజీషాహిద్(48) ఘటనాస్థలానికి ఉదయం 8 గంటల సమయంలో తమ ద్విచక్ర వాహనంపై చేరుకున్నారు.

వారిపై నిందితులు అటవీశాఖాధికారులపై గొడ్డళ్లతో దాడి చేసి పాశవికంగా నరికేశారు. లాజర్, బాజీషాహిద్ అక్కడికక్కడే మృతిచెందారు. అటవీశాఖ డీఆర్‌వో నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాజర్, బాజీలు తమ వద్దనున్న కెమెరాతో తీసిన ఫొటోలను పరిశీలించిన పోలీసులు.. ఈ దారుణానికి పాల్పడిన వారు ఘటనా ప్రాంతానికి సమీపంలోని గాంధీనగర్(సంగం)కు చెందినవారుగా గుర్తించారు. గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement