సాక్షి, హైదరాబాద్ : ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నియామకానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగిపోయిన బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీని చేపట్టాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. 1857 బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది. అయితే, టీఎస్‌పీఎస్సీ 6(A) రూల్స్ పాటించకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నియామకాలను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సింగిల్‌బెంచ్ విచారించి స్టే విధించింది. దీంతో సింగిల్ బెంచ్ విధించిన స్టే పై పలువురు అభ్యర్థులు డబుల్ బెంచ్‌లో సవాల్ చేశారు. విచారించిన డబుల్ బెంచ్ బీట్ ఆఫీసర్ల నియామకం జరపాలని.. ఇతరత్రా ఏమైనా నిబంధనలు ఉంటే టీఎస్‌పీఎస్సీ చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటవీశాఖలో అధికారుల నియామకం ఆగిపోతే ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment