సాఫ్ట్వేర్ ఇంజనీర్పై జరిగిన దారుణ అత్యాచార సంఘటన నుంచి హైదరాబాద్ వాసులు తేరుకోకముందే మరో ఇద్దరు మహిళలపై దుండగులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. బుధవారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఒకరిని కత్తితో పొడవగా, మరొకరిపై మత్తుమందు చల్లి ఇంట్లో విలువైన వస్తువుల్ని దోచుకెళ్లాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి హిల్స్లో కల్లమ్మ అనే గృహిణి ఒంటరిగా ఉన్న సమయంలో అపరిచితుడు ఇంట్లోకి ప్రవేశించాడు. రసాయనాలు చెల్లిన కర్చీఫ్ను ఆమె ముఖంపై ఉంచడంతో స్పృహ కోల్పోయింది. అనంతరం 80 గ్రాముల బంగారు నగలు దోచుకెళ్లాడు. ఆనంద్నగర్లో జరిగిన మరో సంఘటనలో ఉపాధ్యాయిని కవిత తీవ్రంగా గాయపడింది. ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న కవిత మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చింది. గుర్తుతెలియని దుండగుడు పరిచయమున్న వ్యక్తిలా వచ్చి ఆమెపై బ్లేడ్వంటి పదునైన ఆయుధంతో దాడిచేశాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చిత్తూరులో జరిగిన మరో సంఘటనలో దొంగలు పట్టపగలే బంగారు నగలు దోచుకెళ్లారు.
హైదరాబాద్లో ఇద్దరు మహిళలపై అఘాయిత్యం
Published Wed, Oct 23 2013 6:35 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement