సాక్షి, హైదరాబాద్: నగరంలోని తాజ్‌దక్కన్ హోటల్‌లో 25న ‘యూఎస్ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్‌షిప్ ఎక్స్ పో’ని ఇంటర్నేషనల్ స్టూడెంట్ నెట్‌వర్క్ (ఐఎస్‌ఎన్) నిర్వహించనుంది. ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించటం ఎక్స్‌పో ముఖ్య ఉద్దేశం. ఇంజనీరింగ్, బిజినెస్, ఫార్మసీ, ఆర్ట్స్ కోర్సులను అభ్యసించాలనుకున్న విద్యార్థులు తమ రిపోర్ట్ కార్డులు, ట్రాన్‌స్క్రిప్టులు, టోఫెల్ స్కోర్ వివరాలతో ఎక్స్‌పోకి హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు 99490 93501లో సంప్రదించవచ్చు.
మే 21న ఈసెట్
ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు మే 21న ఈసెట్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 6 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్ష ఫలితాలను మే 31న వెల్లడించనున్నారు.
రేపటి నుంచి పుస్తక ప్రదర్శన
తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని ఆ కార్యాలయ ఆవరణలో ఈ నెల 25వ తేదీ నుంచి పుస్తకాల ప్రదర్శన, విక్రయాలు నిర్వహించనున్నారు. వచ్చేనెల 6వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శన ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర ప్రచురణలతోపాటు ప్రపంచ తెలుగు మహాసభల్లో విడుదల చేసిన లఘు గ్రంథాలను ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. ఎంపిక చేసిన పుస్తకాలపై ధరలో 50% రాయితీ ఇవ్వనున్నారు. వివరాలకు 040- 23225215లో సంప్రదించవచ్చు.