'విభజన పాపంలో చంద్రబాబు భాగస్వామి' | Vasireddy Padma fires on telugu desam party president chandrababu naidu | Sakshi
Sakshi News home page

'విభజన పాపంలో చంద్రబాబు భాగస్వామి'

Published Fri, Nov 8 2013 2:59 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

'విభజన పాపంలో చంద్రబాబు భాగస్వామి' - Sakshi

'విభజన పాపంలో చంద్రబాబు భాగస్వామి'

సమైక్య ఉద్యమం దృష్టి మరల్చేందుకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ ప్రసంగిస్తూ... చంద్రబాబు కేసులకు భయపడే యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని విమర్శించడం లేదని వ్యాఖ్యానించారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాపం చేశారని,  ఆ పాపంలో చంద్రబాబు కూడా భాగస్వామి అని పద్మ పేర్కొన్నారు. తన నీడను కూడా నమ్మని మనిషి చంద్రబాబు నాయుడు అని వాసిరెడ్డి పద్మ ఈ సందర్బంగా ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement