రుణమాఫీ లబ్ధిదారులకు ప్రభుత్వం మరో పరీక్ష పెట్టింది. అర్హులను వెతికేందుకు వడపోతకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు రుణమాఫీ మేళాలు నిర్వహించి అర్హులకు ధ్రువీకరణపత్రాలు జారీచేసేందుకు రుణమేళాలు నిర్వహిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్నికల సంఘం అనుమతే అనివార్యమైంది.
మహబూబ్‌నగర్ వ్యవసాయం: ఎన్నికల హామీమేరకు రైతురుణాలు మాఫీచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదట్లో కుటుంబంలో ఎంతమంది ఉన్నా..రుణమాఫీ చేస్తామని చెప్పింది. తీరా కుటుంబంలో ఒక్కరికే రూ.లక్ష వరకు రుణమాఫీచేస్తూ గత సెప్టెం బర్‌లో జీఓ విడుదల చేసింది. జనవరి చివరి వరకు రుణాలను రెన్యూవల్ చేసుకుంటేనే మాఫీ వర్తిస్తుందని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో చాలామంది రైతులు రెన్యూవల్ చేసుకోకపోవడంతో మళ్లీ ఈనెల 15వ తేదీనాటికి గడువు విధించింది. రెన్యూవల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ అని స్పష్టంచేసిన ప్రభుత్వం పట్టాదా రు పాసుపుస్తకాలు బ్యాంకర్లకు చూపిం చాలన్న మెలికపెట్టింది. బ్యాంకర్లు డిక్లరేషన్ చేసిన రైతుల జాబితా ప్రామాణికంగా అధికారులు అర్హులను గుర్తిం చారు. అయితే కొన్ని కారణాల వల్ల రెన్యూవల్ చేసుకోని అన్నదాతలకు ప్రభుత్వం మొండిచేయి చూపనుంది. అంతేకాకుండా బంగారంపై రుణాల రెన్యూవల్‌పై కచ్చితమైన మార్గదర్శకాలు ప్రకటించకపోవడంతో బ్యాం కర్లు రుణమాఫీపై వెనకడుగు వేశారు. దీంతో బంగారురుణాల మాఫీ జిల్లాలో ప్రశ్నర్థాకంగా మారింది.
రైతుల గుండెల్లో గుబులు
జిల్లాలోని 6.07లక్షల మంది రైతులు రూ.2725కోట్ల రుణాలను నాలుగు విడతలుగా మాఫీ పొందేందుకు అర్హత సాధించారు. మొదటివిడతలో జిల్లాకు 25శాతం అనగా రూ.681.45కోట్లు విడుదల చేశారు. కాగా, ఇప్పటివరకు దాదాపు 4.80లక్షల మంది మాత్రమే దాదాపు రూ.2170కోట్లను రెన్యూవల్ చేసుకుని రుణం పొందారు.
ఇదిలాఉండగా, ఈనెల 15 తేదీతో గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రటించిన మాదిరిగా జిల్లాలో 16 నుంచి 23వ తేదీ వరకు రుణామేళాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోఎన్నికలసంఘంఅనుమతి కోసం వేచిచూస్తున్నారు. అధికారులు ఓ వైపు ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు రైతుల గుండెల్లో గుబులు మొదలైంది.
జిల్లాలో గుర్తించిన రైతులందరికీ రుణ మాఫీ కింద మొదటి విడత సొమ్ము బ్యాంకులో జమైంది. ఇప్పటివరకు రె న్యూవల్ చేసుకోని రైతుల ఖాతాల నుం చి వాటిని వెనక్కి తీసుకోనున్నారు. అ లాగే బ్యాంకర్ల డిక్లేరేషన్ ప్రామాణికం కావడంతో అవగాహనలేమి, వలసవెళ్లిన,మృతిచెందిన,అప్పులబాధతో భూ ములు అమ్ముకున్న రైతులకు రెన్యూవల్‌లో ఎలాంటి మినయింపు ఇవ్వలేదు.
దీంతో రెన్యూవల్ చేసుకోని రైతుల కుటుంబసభ్యుల్లోగుబులు మొదలైంది. ఎనిమిది రోజుల పాటు నిర్వహించే రుణమాఫీ మేళాలో అన్ని గ్రామాల్లో తహశీల్దార్ సంతకంతో కూడిన రుణ ధ్రువీకరణపత్రాలను రెవెన్యూ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అందజేస్తారు. ఈ పత్రాలు పొందిన రైతులు మాత్రమే వచ్చే మూడేళ్లలో మూడు విడతలుగా రుణమాఫీకి అర్హత సాధిస్తారు.
అనుమతి కోసం వేచిచూస్తున్నాం..
ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు రుణమాఫీ మేళా లు నిర్వహించేం దుకు ఏర్పాటుచేశాం. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. సోమవారంలోగా అనుమతిపై సమాచారమందే అవకాశం ఉంది. అనుమతులు రాగా నే రుణమాఫీ పత్రాలను రైతులకు అందజేస్తాం.
- భగవత్‌స్వరూప్,
జేడీ, వ్యవసాయశాఖ
పత్రం ఉంటేనే మాఫీ !
Published Mon, Feb 16 2015 3:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement