ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు స్పష్టం చేశారు. టీడీపీకీ మద్దతు ఇస్తున్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపల్ కన్వీనర్లు పి.పోలారావు, పి.కోటి తదితరులు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలోనే మున్సిల్ పాలన పగ్గాలు చేపడతామని, 23 వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ బీ-ఫారం ద్వారా ఎన్నికయ్యామని, ఇతర పార్టీలకు మద్దతు పలుకుతామనడంలో అర్థం లేదని, అటువంటి ప్రచారాలను నమ్మనవసరం లేదని కొట్టిపారేశారు. పార్టీ కౌన్సిలర్దందరూ ఒకే తాటిపై ఐకమత్యంగా ఉంటామని, పార్టీ అబివృద్ధికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, కౌన్సిలర్లుగా విజయం సాధించిన సుగ్గు ప్రేమ్ కుమార్, సాలిన ఢిల్లీ, రవికుమార్ బెహరా, బోనెల ఆనంద్, బాసి పార్వతీశం, మహిళా కౌన్సిలర్ల ప్రతినిధులు కాళ్ల దేవరాజ్, పి.కోటి, పల్లంటి వెంకట ప్రసాద్, రెయ్యి నారాయణ, బి.త్రినాథ్, పి.దేవరాజ్, ఎం.వెంకటరెడ్డి, జగన్, పార్టీ నాయకులు అనపాన పితాంబర్, గుజ్జు తారకేష్ పాల్గొన్నారు.
‘టీడీపీకి మద్దతు’ ప్రచారంలో వాస్తవం లేదు
Published Sat, May 24 2014 1:37 AM | Last Updated on Tue, Oct 16 2018 6:40 PM
Advertisement