
రాజమండ్రి వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రమణ్యం (ఫైల్ ఫోటో)
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రిలో పార్టీని పటిష్టపరచడంలో భాగంగా అనుబంధ విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రమణ్యం మంగళవారం తెలిపారు. 42 వార్డుల్లో పార్టీని పటిష్టం చేసే విధంగా కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికుల పేరుతో నిరసనలు చేసి, నకిలీ నాయకులను తయారు చేసిన టీడీపీ నేతలకు బుద్దొచ్చేలా వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్లను పటిష్టం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మరోవైపు రాజమండ్రిలో తెలుగుదేశం నుంచి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే వారితో సమావేశమవుతామని సుబ్రమణ్యం వివరించారు.