అసెంబ్లీ ప్రోరోగ్ అయితేనే ఆర్డినెన్సుల జారీకి వీలుంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
అసెంబ్లీ ప్రోరోగ్ అయితేనే ఆర్డినెన్సుల జారీకి వీలుంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రోరోగ్ అనేది పాలనాపరమైన అంశమని, అంతేతప్ప ఇందులో రాజకీయాలు, దురుద్దేశాలు ఏమీ లేవని తెలిపింది.
ప్రోరోగ్ నోట్ పంపాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశామని, ఆయన నుంచి సమాధానం ఇంకా రావాల్సి ఉందని సీఎంవో చెప్పింది. కార్యదర్శి ఇచ్చే సూచనను బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని సీఎంవో వర్గాలు తెలిపాయి.