గిరిజనుల సమస్యలను ప్రస్తావించకుండా తమ సొంత ఎజెండాతో ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను....
పార్వతీపురం(విజయనగరం): గిరిజనుల సమస్యలను ప్రస్తావించకుండా తమ సొంత ఎజెండాతో ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను నిర్వహిస్తున్న టీడీపీ నేతల తీరుపై లోకాయుక్తను ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యేలు రాజన్న దొర, పుష్పశ్రీవాణిలు శనివారం విలేకరులతో మాట్లాడారు.
ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు మొక్కుబడిగా సాగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా అంగన్‌వాడీ పోస్టుల భర్తీ అధికార పార్టీనేతల కనుసన్నల్లోనే సాగుతోందని, విధి విధానాలను పాటించకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తుండటంపైనా లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు వివరించారు.