పోలవరం డిజైన్ మార్చేవరకు పోరాటం: తమ్మినేని
హైదరాబాద్: పోలవరం డిజైన్ మార్చేవరకు పోరాటం చేస్తామని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రంలో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం దిశగా పనిచేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంత అభివృద్దిపై, ప్రజాహక్కులపై పార్టీ దృష్టిసారిస్తుందన్నారు.
రైతులకు జూన్ 15 వరకు పంటరుణాలు ఇచ్చి ఎరువుల కొరత లేకుండా చూడాలని కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తమ్మినేని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొటామని.. తమ పార్టీ తరపున సభలు, సమావేశాలు నిర్వహిస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.