జిల్లాల సంఖ్య పెంచుతాం: వైఎస్ జగన్
నంద్యాల: ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ ప్రచార సభలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఈసందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ మోసపూరిత జీవోలు ఇస్తూ అబద్ధపు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
బహిరంగ సమావేశంలో వైఎస్ జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈసందర్భంగా అన్నవస్తున్నాడు, నవరత్నాల హామీలతో పాటు పలు హామీలు ప్రకటించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయని, కానీ అథికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చుతామని, మొత్తం 25 జిల్లాలుగా మార్పు చేస్తామని ప్రకటించారు. నంద్యాల పట్టణాన్ని కలెక్టరేట్,ఎస్సీ కార్యాలయాలతో జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. 2018లో వచ్చే ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానానికి నంద్యాల నుంచే ముస్లిం మైనారీటికి అవకాశం ఇస్తామని ప్రకటించారు.
నవరత్నాలు.. అన్న వస్తున్నాడు