ఇందూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే సంక్షేమ శాఖలలోని కీలక స్థానాలు ఖాళీగా ఉన్నాయి. చాలా పోస్టులను ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. పోస్టులు ఖాళీగా ఉండడంతో హాస్టళ్లపై పర్యవేక్షణ కొరవడుతోంది. సంక్షేమం పడకేస్తోంది. ఒక్కో అధికారి రెండు చోట్ల పనిచేయాల్సి వస్తుండడంతో ఒత్తిడి పెరిగిపోతోంది. ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షణ కొరవడుతోంది.
బీసీ వెల్ఫేర్‌లో
బీసీ సంక్షేమ శాఖలో జిల్లా స్థాయి అధికారి పోస్టుతోపాటు పలు వార్డెన్ల పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి (బీసీడబ్ల్యూఓ) పోస్టు ఏడాది గా ఖాళీగా ఉంది. గతంలో బీసీడబ్ల్యూఓగా పని చేసి న రాజయ్య ఉద్యోగ విరమణ పొందడంతో ఈ పోస్టు ఖాళీ అయ్యింది. బోధన్ సహాయ సంక్షేమాధికారిగా పని చేస్తున్న విమలాదేవికి ఇన్‌చార్జి బాధ్యత లు అప్పగించారు. ఆమె రెండు బాధ్యతలను చూసుకోవాల్సి రావడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. శాఖలో మరో ఐదు ప్రధాన పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, రెండు జూనియర్ అసిస్టెంట్, ఓ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. బీసీడబ్ల్యూ జిల్లా కార్యాలయంలో అటెండర్ సైతం లేకపోవడం గమనార్హం. కామారెడ్డి సహాయ సంక్షేమాధికారి పోస్టు కూడా ఖాళీగానే ఉంది. వార్డెన్ పోస్టులూ భర్తీ చేయ డం లేదు. జిల్లాలో 42 బీసీ హాస్టళ్లు ఉండగా, 29 హాస్టళ్లకు మాత్రమే రెగ్యులర్ వార్డెన్లున్నారు. మిగిలి న 13 హాస్టళ్లను ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు.
‘సాంఘికం’లోనూ అంతే
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిస్థితేం మెరుగ్గాలేదు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి (డీఎస్‌డబ్ల్యూఓ) పోస్టు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. డిప్యూ టీ డెరైక్టర్ పోస్టు స్థానంలో రాష్ట్ర స్థాయి కేడర్ కలిగిన జాయింట్ డెరైక్టర్(జేడీ) ఖాలేబ్‌ను ప్రభుత్వం జిల్లా కు పంపింది. జిల్లా సాంఘిక సంక్షేమాధికారి పోస్టు మాత్రం భర్తీకి నోచుకోలేదు. బోధన్ సహాయ సాంఘిక సంక్షేమాధికారిగా ఉన్న భూమయ్య అవినీ తి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు. మూన్నెళ్లు గడుస్తున్నా ఈ స్థానంలో ఎవరినీ నియమించలేదు. సీనియర్ వార్డెన్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకున్నారు. మద్నూర్ సహాయ సంక్షేమాధికారి సెలవుపై వెళ్లారు. కార్యాల య పరిపాలనాధికారి(ఏఓ) మరణించడంతో ఆ పో స్టు ఖాళీ అయ్యింది. సహాయ సంక్షేమాధికారి జగదీ శ్వర్‌రెడ్డి ఇన్‌చార్జి ఏఓగా పనిచేస్తున్నారు. బోధన్, కామారెడ్డి సహాయ సంక్షేమాధికారి కార్యాలయాల్లో ఒక్కోజూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నాయి.
‘సంక్షేమం’పై ప్రభావం
సంక్షేమ శాఖల్లో జిల్లా స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం పడుతోంది. ఉన్న ఉద్యోగులకే అదనంగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు. ఇటు సొంత ఉద్యోగం అటు అదనపు బాధ్యతలు చూసుకోవాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, కార్యాలయాల బిల్లులు ఆన్‌లైన్ చేయడంలో జాప్యం జరుగుతోంది. వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం సాధ్యపడడం లేదు. పని భారం తట్టుకోలేక పలువురు అధికారులు, ఉద్యోగులు కొందరు సెలవు పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
‘సంక్షేమం’ ఖాళీ
Published Mon, Dec 9 2013 6:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement