రోజుల తరబడి నిరీక్షిస్తున్న పత్తి రైతులకు నిరాశే మిగలనుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తడిసిన, రంగు మారిన పత్తిని ఎప్పటికైనా సర్కారు కొనుగోలు చేస్తుందని కొండంత ధీమాతో ఉన్న రైతుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. బుధవారం తెరచుకోనున్న సీసీఐ కేంద్రాల ద్వారా.. వర్షం కారణంగా దెబ్బతిన్న పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పలేదు. పాత నిబంధన మేరకే పత్తి సేకరిస్తామని వెల్లడించింది. దీంతో అన్నదాతలు మరింత దిగులు చెందుతున్నారు.
సాక్షి, నల్లగొండ: ఎన్నడూ లేనంతగా జిల్లాలో ఈ ఏడాది 7.08 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు పత్తి సాగుచేశారు. పంట చేతికొచ్చే దశలో అక్టోబర్ 22 నుంచి 26వ తేదీ వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పత్తి పెద్దఎత్తున దెబ్బతిన్నది. 3.80 లక్షల ఎకరాల పంట నాశనమైంది. చేను మీదున్న పత్తి పూర్తిగా రంగుమారింది.
కొన్నిచోట్ల దూదిపింజలు మొలకెత్తాయి. దీంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రోజుల తరబడి నిల్వ చేయలేక కొంతమంది రైతులు తడిసిన పత్తిని వచ్చిన రేటుకు విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.4000 ఉండగా... రూ.2500 నుంచి రూ.3 వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. మరికొందరు పత్తిని అలాగే నిల్వ చేశారు. రేపోమాపో సర్కారు కొనుగోలు చేయకపోతుందా ఇన్ని రోజులు గడిపారు. ఇటువంటి రైతులను సర్కారు ఆదుకోలేకపోతోంది. వర్షం కారణంగా వాటిల్లిన్న నష్టాన్ని ప్రత్యక్షంగా చూసినా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. కాసితైంనా క ణికరించడం లేదు.
ఒరిగేదేం లేదు...
పత్తి కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనలు సడలించాలని కేంద్ర టెక్స్‌టైల్స్, వ్యవసాయ శాఖకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు లేఖ రాశారు. అన్నీ కోల్పోయిన రైతు పట్ల మానవత దృక్పథంతో ఆలోచించాలని కోరారు. తడిసిన, రంగు మారిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా చలనం కరువైంది. తడిసిన పత్తిని కోనుగోలు చేయలేని సీసీఐ కేంద్రాల వల్ల తమకేం లాభమని రైతులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి కేంద్రాలు ఉన్నా లేకున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదని అంటున్నారు.
హామీలు.. నీటి మూటలు
వర్షం కారణంగా వాటిల్లిన్న నష్టాన్ని ప్రత్యక్షంగా చూసినా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. కాసితైంనా క నికరించడం లేదు. దెబ్బతిన్న పంటలు, జరిగిన నష్టం తెలుసుకునేందుకు అక్టోబర్ 27వ తేదీన రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి జిల్లాలో పర్యటించారు. తడిసిన, రంగు మారిన పత్తి కొనుగోలు చేస్తామని ైరె తులకు హామీ ఇచ్చారు. నకిరేకల్, చౌటుప్పల్ మండలాల్లో గతనెల 7వ తేదీన సీసీఐ మేనేజింగ్ డెరైక్టర్‌తో సహా పలువురు అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా త్వరలో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో 12 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేస్తామన్నారు. అంతేగాక ఇదేనెల 18, 19 తేదీల్లో ఇద్దరు సభ్యులతో కూడిన కేంద్రం బృందం నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో పర్యటించింది. నష్టాన్ని ప్రత్యక్షంగా చూసి కేంద్రానికి నివేదించారు. అయినా సర్కారులో చలనం రాకపోవడంపై అన్నదాతలు భగ్గుమంటున్నారు.
రెండు కేంద్రాలు ప్రారంభం..
భువనగిరి, నకిరేకల్‌లో సీసీఐ కేంద్రాలు మంగళవారం ప్రారంభమవుతాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరో వారంలో ఇంకా 10 కేంద్రాలు ఏర్పాటు చేస్తారని సమాచారం. అయితే తడిసిన, రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలన్న ఆదేశాలు వ్యవసాయ శాఖాధికారులకు అందలేదు. గతంలో పాటించిన నాణ్యత ప్రమాణాల మేరకే పత్తి కొనుగోలు చేస్తామని వారు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో వర్షంతో దెబ్బతిన్న పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరగనుంది.
ఏం లాభం..?
Published Wed, Dec 4 2013 4:10 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement