బాడంగి (విజయనగరం) : గోదావరి పుష్కరాల మొదటి రోజు రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఓ మహిళ శుక్రవారం కన్నుమూసింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం తాల్తేరు గ్రామానికి చెందిన పూడి తారమ్మ(65) కుటుంబ సభ్యులతో కలసి పుష్కర స్నానం కోసం రాజమండ్రి వెళ్లింది.
ఆ రోజు జరిగిన ఘోర తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా ఆ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారిలో తారమ్మ కూడా ఉన్నారు. అప్పటి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారమ్మ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందింది.
పుష్కర తొక్కిసలాటలో గాయపడిన మహిళ మృతి
Published Fri, Jul 31 2015 3:07 PM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM
Advertisement
Advertisement