జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిలా రు కాలనీకి చెందిన యువకుడు మంత్రి బాబ్జీ
నరసన్నపేట : జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిలా రు కాలనీకి చెందిన యువకుడు మంత్రి బాబ్జీ (23) దుర్మరణం చెందా డు. శ్రీకాకుళం నుంచి శ్రీముఖలింగం వెళ్తున్న ఆర్టీసీ బస్‌లో బాబ్జీ ప్రయాణిస్తుం డగా కోమర్తి వద్దకు వచ్చే సరికి ముందు డోర్ నుంచి జారి పడిపోయాడు.
ఇంతలో బస్సు వెనుక టైరు అతని పైనుంచి వెళ్లిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న బాబ్జీని అతని తండ్రి మల్లేసు శ్రీకాకుళంలో వైద్యుని వద్ద చూపించి తిరిగి బస్సులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్ వెనుక కూర్చున్న మల్లేసు ప్రమాదాన్ని గమనించేలోపే బాబ్జీ మరణించడంతో ఆయన రోదించిన తీరు అక్కడివారిని కలచి వేసింది. సంఘటన స్థలాన్ని శ్రీకాకుళం ఆర్టీసీ-2 డిపో మేనేజరు అరుణకుమారి, నరసన్నపేట సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ చిన్నంనాయుడులు పరిశీలించారు.