చెరువులో మునిగి యువకుని మృతి | young man Submerged in the pond | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి యువకుని మృతి

Published Sun, Jan 10 2016 4:14 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

young man Submerged in the pond

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం టెంకవరం గ్రామానికి చెందిన పెంచలయ్య(26) అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం చెరువులో మునిగి మృతిచెందాడు. టెంకవరం గ్రామానికి చెందిన కొండయ్య, జయమ్మ దంపతులకు పెంచలయ్య ఒక్కడే సంతానం. అతను చెన్నైలో తాపీ పని చేసేవాడు. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చాడు.

ఆదివారం మధ్యాహ్నం ఎనుములను తోలుకుని వెళ్లాడు. చెరువులో వాటితో పాటు ఈతకొడుతుండగా నీటిలో కంపచెట్టు ఉన్న విషయం తెలియక మునక వేశాడు. కంప చెట్టులో ఇరుక్కుపోయి మృతిచెందాడు. గమనించిన స్థానికులు మృతదేహాన్ని వెలికి తీశారు. ఒక్కగోనొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement