♦ ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు
♦ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఏపీ ప్రతిపక్షనేత
సాక్షి, కడప: మహానేత,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు శనివారం ఉదయాన్నే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్ అనీల్ కుమార్, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ఆర్ సోదరుడు దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
కాగా వైఎస్‌ఆర్ భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం ఆయన ఇంకా బతికే ఉన్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ట్విట్ చేశారు.
YSR lives because he made lives better. He lives because his vision is relevant to the world. He lives because he lives in our hearts.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 2 September 2017
అనంతరం వైఎస్ జగన్ వేంపల్లెలో ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన గ్రామంలోని రామాలయాన్ని సందర్శించారు. కాగా మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందులలోని భాకరాపురంలో వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో ‘వైఎస్ కుటుంబం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)