గాంధీ భవన్‌లో వైఎస్సార్ వర్ధంతి
Published Sat, Sep 2 2017 2:21 PM | Last Updated on Sat, Jul 7 2018 3:36 PM
హైదరాబాద్: వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పేదల కోసం పని చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందన్నారు.
పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ పేదరికం, మానవీయ దృక్పథం కోణంలో వైఎస్ పనిచేశారన్నారు. ఆరు లక్షల ఎకరాల భూ సేకరణ చేస్తే ఒక్క కేసూ లేదన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు విలువలేదన్నారు. ఉద్యమకారుడు చనిపోతే ఆయన కుటుంబాన్ని పట్టించుకోలేదని, ఇది చాలా బాధాకరమని అన్నారు.
Advertisement
Advertisement