తిరుపతి: దివంగత మఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేర్చే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని వైఎస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు. ఆదివారం వైఎస్ జగన్ జన్మదినం సందర్బంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... చంద్రబాబు ఆరు నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని తెలిపారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పోరాటం వల్లే కొంత మందికైనా న్యాయం జరిగుతోందని అన్నారు. జగన్ జన్మదినం సందర్బంగా యువకులు పెద్ద సంఖ్యలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం శుభ పరిణామమని వారు పేర్కొన్నారు.