
నవంబర్ 5న నిరసన ప్రదర్శనలు:వైఎస్ జగన్ పిలుపు
ప్రభుత్వం చేసే మోసాలకు, వంచనకు నిరసన తెలుపుతూ నవంబరు 5న అన్ని మండల కార్యాలయాల వద్ద ప్రదర్శనలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
విజయనగరం: ప్రభుత్వం చేసే మోసాలకు, వంచనకు నిరసన తెలుపుతూ నవంబరు 5న అన్ని మండల కార్యాలయాల వద్ద ప్రదర్శనలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళలు ముందుకు వచ్చి నిరసనలు తెలపాలన్నారు.
రైతుల రుణాలు మాఫీ చేయలేదు, రీషెడ్యూల్ కూడా చేయలేదన్నారు. క్రాప్ ఇన్యూరెన్స్ కూడా లేదని చెప్పారు. రైతులు తీసుకున్న రుణాలపై 14 శాతం వడ్డీ పడుతుందని తెలిపారు. ఈ పరిస్థితులలో రైతులు రుణాలు ఎలా చెల్లిస్తారని జగన్ ప్రశ్నించారు.
తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణాసంచా గోడౌన్లో జరిగిన పేలుడు దుర్ఘటనపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.
తిప్పవలసలో బాధితులకు పరామర్శ
పూసపాటిరేగ మండలం తిప్పవలసలో తుపాను బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. మత్య్సకారులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.