పాదయాత్రతో మీ చెంతకే వస్తున్నా: వైఎస్‌ జగన్‌ | YS jagan mohan reddy announces padayatra | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ సాహసోపేత నిర్ణయం

Published Sun, Jul 9 2017 4:51 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

పాదయాత్రతో మీ చెంతకే వస్తున్నా: వైఎస్‌ జగన్‌ - Sakshi

పాదయాత్రతో మీ చెంతకే వస్తున్నా: వైఎస్‌ జగన్‌

గుంటూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బాటలో నడవనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్ట సుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై పలు పోరాటాలు చేసిన జననేత ఇప్పుడు నేరుగా పాదయాత్రతో ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. గతంలో వైఎస్‌ఆర్‌ తనయ వైఎస్‌ షర్మిల తండ్రి బాటలో నడుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే.

అక్టోబర్‌ 27 నుంచి పాదయాత్రకు ఇడుపులపాయ నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ వేదికగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు దగా కోరు ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. ఆరు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని వెల్లడించారు.

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర గురించి ఇంకా ఏం చెప్పారంటే.. 'ప్రతి ఊరుకి పోండి.. ప్రతి గ్రామానికి వెళ్లండి.. త్వరలోనే అన్న వస్తున్నాడని చెప్పండి. అందరికీ భరోసా ఇస్తూ నేను కూడా వస్తా.. అక్టోబర్‌ 27 నుంచి దాదాపు ఆరు నెలల పాటు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా. ప్రతి జిల్లాకు, ప్రతి ప్రాంతానికి వస్తా.. మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి తిరుమలకు వెళ్తా.. కాలి నడకన కొండెక్కి తిరుమలేశుడిని దర్శించుకుంటా. అక్కడి నుంచి ఇచ్ఛాపురం దాకా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా. ఊరు వాడా అందరికీ చెప్పండి. అన్న వస్తున్నాడు. మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. వైఎస్‌ మాదిరిగానే అధికారం తెచ్చుకుంటాం. ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. మీ అందరి ఆశీస్సులు కావాలి. నష్టపోయాం అని తెలుసు. కేసులు పెడుతున్నారని తెలుసు. మంచి కాలం వస్తుంది. ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతా. మీ అందరి ఆశీస్తులు కోరుతున్నా.'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement