
సాక్షి, విజయవాడ : సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి, మంత్రులపై అభ్యంతరకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ద్వారాకా తిరుమలరావు స్పష్టం చేశారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాలు వైస్సార్సీపీ నాయకులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడంపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రోద్భలంతోనే 24వ డివిజన్ టీడీపీ నేతలు ఇలాంటి పోస్టులు పెడుతున్నారని వైసీపీ నేతలు సీపీకి వివరించారు. ఈ క్రమంలో వైసీసీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీకి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌కు పెరుగుతున్న ఆదరణ చూపి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి దూసుకుపోతున్నాయన్నారు. అందుకే కొంతమంది కావాలనే ఇలా అభ్యంతరకరమైన పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్నారని, వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment