
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మొదటి నుంచి రాజీ పడకుండా పోరాటం చేశారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. హోదానే ఏపీకి సంజీవని అని వైఎస్ జగన్ ఉద్యమిస్తున్నారన్నారు. గుంటూరు వేదికగా ఆయన ఆమరణ దీక్ష కూడా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం హోదాను వదిలిపెట్టి ప్యాకేజీకి అంగీకరించారని మండిపడ్డారు. హోదాతోనే ఏపీకి అభివృద్ధి సాధ్యమంటూ నాలుగేళ్లుగా వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఉమ్మారెడ్డి అన్నారు.