'దొడ్డిదారిలో చట్టసభకు లోకేశ్' | ysrcp leader kannababu fire on nara lokesh about his tweets | Sakshi
Sakshi News home page

'దొడ్డిదారిలో చట్టసభకు లోకేశ్'

Published Sat, Mar 25 2017 9:49 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

'దొడ్డిదారిలో చట్టసభకు లోకేశ్' - Sakshi

'దొడ్డిదారిలో చట్టసభకు లోకేశ్'

కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్‌ ఇటీవల చేసిన ట్వీట్లపై వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. దొడ్డిదారిలో చట్టసభకు వచ్చిన లోకేశ్‌కు ప్రతిపక్షాన్నికానీ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డినిగానీ విమర్శించే అర్హత లేదన్నారు. కాకినాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. అవినీతి, అక్రమాలతో సీఎం చంద్రబాబు పాలన చాలా దరిద్రంగా ఉందన్నారు.

ప్రతిపక్షం వరెస్ట్ అంటూ టీడీపీ నేతలు లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారు.. కానీ త్వరలో టీడీపీకే రెస్ట్ రాబోతోందని వైఎస్సార్ సీపీ నేత ఎద్దేవా చేశారు. మారు వేషాల్లో తండ్రీకొడుకులు ఒకసారి ప్రజల్లో తిరిగితే వారు తమ గురించి ఏమనుకుంటున్నారో చంద్రబాబు, లోకేశ్‌లకు తెలుస్తుందని కన్నబాబు చెప్పారు. ఎమ్మెల్యే కోటాలో లోకేశ్ ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement