‘పాదయాత్రకు కనీవిని ఎరుగని రీతిలో స్వాగతం’ | Ysrcp Leader Pilli Subhash Chandra Bose On Prajasankalpayatra  | Sakshi
Sakshi News home page

‘పాదయాత్రకు కనీవిని ఎరుగని రీతిలో స్వాగతం’

Published Thu, Jun 7 2018 1:13 PM | Last Updated on Fri, Jul 6 2018 2:54 PM

Ysrcp Leader Pilli Subhash Chandra Bose On Prajasankalpayatra  - Sakshi

సాక్షి, ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవెంట్ మేనేజర్ గా మారారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటినీ నెరవేర్చలేదన్నారు. బాబుకు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. ఆయన పాపం పండే రోజులు దగ్గర పడ్డాయన్నారు. 

మరోవైపు వైఎస్‌ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారని.. ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణనే అందుకు నిదర్శనమన్నారు. నాలుగేళ్ళుగా ప్రజలంతా అనేక సమస్యలతో సతమతమవుతూ జగన్‌మోహన్ రెడ్డికి తమ సమస్యలను చెప్పుకుంటున్నారన్నారు. ఈ నెల 12న తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించే ప్రజాసంకల్పయాత్రకు కనీవిని ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర కంటే వందరెట్లు ఎక్కువ, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయేలా జగన్ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement