
సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న దుర్మార్గతీరును ప్రజలకు కళ్లకు కట్టేలా వివరించడమే ప్రాజెక్టు సందర్శన లక్ష్యమని వివరించింది.
పోలవరం ప్రాజెక్టును రక్షించునేందుకు, సత్వరం నిర్మించుకునేందుకు అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చేలా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలిపింది. గురువారం అమరావతిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి నాయకులందరూ బస్సుల్లో పోలవరం ప్రాజెక్టు వద్దకు బయల్దేరతారని వెల్లడించింది.