అనంతపురం అగ్రికల్చర్: వినతులు స్వీకరిస్తూ.. భరోసా కల్పిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు చేపట్టారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా.. ప్రధానంగా ఎస్సీ కాలనీల్లో రచ్చబండ, పల్లెనిద్రతో పార్టీ నేతలు ప్రజలతో మమేకమయ్యారు. రాయదుర్గం, తాడిపత్రి, హిందూపురం, కదిరి మినహా తక్కిన 10 నియోజకవర్గాల పరిధిలో కార్యక్రమాలు చేపట్టారు. రైతులు, పొదుపు రుణాల మాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ పరిహారంలో అవకతవకలు.. పింఛన్లు, ఇళ్ల నిర్మాణం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, మురికి కాలువలు ఇతరత్రా సమస్యలను ప్రజలు ఏకరువు పెట్టారు.
♦ బీసీ, ఎస్సీ కాలనీల దుస్థితి, పేద వర్గాల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని నాయకులు పిలుపునిచ్చారు.
♦ కూడేరు మండలం కరుట్లపల్లి ఎస్సీ కాలనీలో జరిగిన పల్లెనిద్రలో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ నిర్మల, విడపనకల్ జెడ్పీటీసీ తిప్పయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, మండల కన్వీనర్ రాజశేఖర్ తదితరులు హాజరై ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే విశ్వ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కల సాకారం చేయడానికి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాగునీటి, సాగునీటితో జిల్లాను సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తామన్నారు.
♦కళ్యాణదుర్గం మండలం గోళ్ల పంచాయతీ శీబావి గ్రామం ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో అనంతపురం పార్లమెంటు నియోజక వర్గ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలు సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, హంద్రీ–నీవాకు 40 టీఎంసీల నుంచి 60 టీఎంసీలకు పెంచి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజక వర్గాల పరిధిలో అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వడంతో పాటు ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. ఎస్సీ కాలనీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద పల్లెనిద్ర చేశారు.
♦ పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో జరిగిన రచ్చబండలో హిందూపురం పార్లమెంటు నియోజక వర్గ అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి హాజరై ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ, రైతులు, మహిళలు, ఇతరత్రా అన్ని వర్గాలను సీఎం చంద్రబాబు దారుణంగా వంచిస్తూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.
బత్తలపల్లి మండలం గుమ్మనకుంట ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో ధర్మవరం నియోజక వర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఎంపీపీ కోటిబాబు, మండల కన్వీనర్ బయపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
♦ చెన్నేకొత్తపల్లి మండల కేంద్రం ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో రాప్తాడు నియోజక వర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్ర కాష్‌రెడ్డి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగి రెడ్డి, మండల కన్వీనర్ మైలారపు గోవిందరెడ్డి తదితరులు పా ల్గొన్నారు. నరసింహస్వామి దేవాలయం వద్ద పల్లెనిద్ర చేశారు.
♦ పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో జరిగిన రచ్చబండలో శింగనమల నియోజక వర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీటీసీ నల్లమ్మ, మండల కన్వీనర్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి సమస్యలు స్వీకరించి వైఎస్ జగన్ సీఎం కాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
♦అనంతపురం రూరల్ మండలం నాగిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండలో అనంత అర్బన్ నియోజక వర్గ సమన్వయకర్త నదీంఅహ్మద్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, మాజీ మే యర్ రాగే పరశురాం, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు. ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర కొనసాగించారు.
♦ అమరాపురం మండలం కే.శివరం గ్రామం ఎస్సీ కాలనీలో జరిగిన రచ్చబండ, పల్లెనిద్రలో మడకశిర నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం.తిప్పేస్వామి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే పల్లెనిద్ర చేశారు.
♦గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, సర్పంచ్ తిక్కయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జింకల రామాంజినేయులు, పామిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
♦ ప్రజా సమస్యలు స్వీకరించిన తర్వాత ఎస్సీ కాలనీ సుంకులమ్మ దేవాలయం వద్ద పల్లెనిద్ర చేశారు.
♦ ఓడీసీ మండలంటి.కుంట్లపల్లిలో జరిగిన రచ్చబండ, పల్లెనిద్రలో పుట్టపర్తి నియోజక వర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హాజరై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment