కార్మికులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం: రాష్ట్రంలో ఏ కార్మికుడి కష్టమొచ్చినా మీ వెంట మేమున్నామంటూ.. వారి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. అపరి ష్కృత సమస్యల పరిష్కారానికి తిరుపతి కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు చే స్తున్న సమ్మెలో భాగంగా గురువారం వా రు నిర్వహించిన రాస్తారోకోకు వైఎ స్సార్ సీపీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు రేయిం బవళ్లు విధుల్లో నిమగ్నమై ఉంటారన్నారు. వారు లేకుంటే నగరం ఎలా కంపు కొడుతుందో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూస్తున్నారన్నారు.
హంగు, ఆర్భాటాల కోసం వందలాది కోట్ల రూపాయిలు వృథాగా ఖర్చు చేస్తున్న చంద్రబాబు కార్మికులకు పనికి తగ్గ వేతనం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. రెండు రోజుల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతులు, ఉద్యోగు లు, కార్మికులు, సామాన్య ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసే ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు తుల సేంద్ర, రామచంద్ర, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు మమత, దొడ్డారెడ్డి సిద్ధారె డ్డి, ఎస్‌కే బాబు, ఆదం రాధాకృష్ణారెడ్డి, సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరీ, కేతం జయచంద్రారెడ్డి, టీ రాజేంద్ర, ఎంవీ ఎస్. మణి, అమరనాథరెడ్డి, ముద్ర నారాయణ, చిన్నముని, హనుమంత్‌నాయక్, కో టూరు ఆంజనేయులు, నల్లాని బాబు, అమోస్‌బాబు, బొమ్మగుంట రవి, నాగిరెడ్డి, మాధవనాయుడు, తాల్లూరు ప్రసాద్, పుణీత, శ్యామల, సాయికుమారి, ప్రమీల పాల్గొన్నారు.