- నోటిఫికేషన్ జారీచేశామని విన్నవించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం
సుప్రీంలో విచారణకు రాని జెడ్పీటీసీ ఎన్నికల కేసు
Published Tue, Mar 11 2014 1:18 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
సాక్షి, న్యూఢిల్లీ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై సోమవారానికల్లా సానుకూలంగా స్పందించాలని, తీసుకున్న చర్యలను సోమవారం కోర్టుకు వివరించాలని గత శుక్రవారం సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు సోమవారం సుప్రీంకోర్టులో 86వ నంబరు అంశంగా జాబితాలో ఉంది.
అయితే 83వ అంశం వరకే విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు మిగిలిన కేసులను బుధవారం లేదా గురువారం విచారిస్తామని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది తాము ఎన్నికల షెడ్యూలు విడుదల చేశామని వివరించబోయారు. దీనికి న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ స్పందిస్తూ షెడ్యూలు విడుదల చేసినట్టుగా అఫిడవిట్ ఇవ్వాలని సూచించారు. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Advertisement