శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి శు. చతుర్దశి రా. 2.14, వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం మఖ రా.3.40 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి పుబ్బ, వర్జ్యం సా.4.19 నుంచి 5.50 వరకు, దుర్ముహూర్తం సా.4.29 నుంచి 5.17 వరకు, అమృతఘడియలు... లేవు.
సూర్యోదయం : 6.21
సూర్యాస్తమయం : 6.03
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అదనపు బాధ్యతలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. నలుపు రంగు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
వృషభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. పసుపు రంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
మిథునం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆరోగ్యభంగం. బంధువులను కలుసుకుంటారు. తెలుపు రంగు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
కర్కాటకం: సంఘంలో గౌరవం. ముఖ్య సమాచారం. ఆప్తులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. దైవదర్శనాలు. ఎరుపురంగు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
సింహం: బంధువర్గంతో వివాదాలు. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. బంగారు రంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. తెలుపు రంగు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
తుల: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. బంధువుల నుంచి ధనలాభం. ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. ఎరుపు రంగు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
వృశ్చికం: బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. పనుల్లో తొందరపాటు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు. గులాబీ రంగు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.
ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తికాగలవు. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వాహనయోగం. నీలం రంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆకుపచ్చ రంగు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
కుంభం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. తెలుపు రంగు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
మీనం: రుణయత్నాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయదర్శనాలు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. పసుపు రంగు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment