శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి శు.చవితి రా.9.10 వరకు తదుపరి పంచమి, నక్షత్రం భరణి ఉ.10.24 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం రా.11.18 నుంచి 1.02 వరకు దుర్ముహూర్తం ఉ.6.54 నుంచి 7.47 వరకు అమృతఘడియలు... లేవు.
సూర్యోదయం : 6.01
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృషభం: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు. ఆధ్యాత్మిక చింతన.
మిథునం: నూతన ఉద్యోగయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. సోదరుల నుంచి పిలుపు.
కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
సింహం: బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు. దైవదర్శనాలు.
కన్య: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సన్నిహితులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.
తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
వృశ్చికం: నూతన వ్యక్తుల పరిచయం. పనులలో ఆటంకాలు తొలగుతాయి. బంధువుల సహాయం అందుతుంది. దైవదర్శనాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత నూతనోత్సాహం.
ధనుస్సు: ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. ధనవ్యయం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో లేనిపోని వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం: కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. అనారోగ్య సూచనలు. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. ధనవ్యయం.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment