ఆంధ్రాబ్యాంక్ ఈడీగా అజిత్ కుమార్ రథ్! | andhra bank ed Ajit Kumar Rath | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్ ఈడీగా అజిత్ కుమార్ రథ్!

Published Sat, Mar 14 2015 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

ఆంధ్రాబ్యాంక్ ఈడీగా అజిత్ కుమార్ రథ్!

ఆంధ్రాబ్యాంక్ ఈడీగా అజిత్ కుమార్ రథ్!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎట్టకేలకు కేంద్రం ఆంధ్రాబ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)ను నియమించింది. రెండు రోజుల కిందటే తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈడీలను నియమించినా... 10 నెలలకు పైగా ఖాళీగా ఉన్న ఆంధ్రాబ్యాంకుకు మాత్రం నియమించలేదు. చివరకు శుక్రవారంనాడు ఆంధ్రాబ్యాంక్ ఈడీగా అజిత్ కుమార్ రథ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది.

బ్యాంకింగ్ వర్గాలు దీన్ని ధ్రువీకరిస్తుండగా.. కేంద్రం నుంచి కానీ ఇటు బ్యాంకు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడం గమనార్హం. శుక్రవారంనాడు కోల్‌కతాలో ఉన్న రథ్... ఎంపికైన వెంటనే అక్క డే ఈడీగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిసింది. బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అనుభవం ఉన్న రథ్... ఈ పదవికి ముందు యూనియన్ బ్యాంక్‌లో ఐటీ విభాగ జీఎంగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement