పూర్తిస్థాయి 4జీ వినియోగానికి మరో రెండేళ్లు!
న్యూఢిల్లీ: భారత్ టెలికాం రంగంలో నాలుగవ జనరేషన్ (4జీ) సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడానికి మరో రెండేళ్లు పడుతుందని టెలికాం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు భారత్ లో కేవలం భారతీ ఎయిర్ టెల్ మాత్రమే 4జీ సేవలందిస్తోంది. 2015లో 4జీ సేవలందించడానికి రిలయన్స్ జీయో ఇన్పోకామ్ సిద్దమవుతోంది. వైర్ లెస్ ఇంటర్నెట్ సదుపాయం 3జీ కంటే ఎక్కువ స్పీడ్ లో అందించే సామర్ధ్యం 4జీ టెక్నాలజీకి ఉంది.
భారత్ లో 4జీ టెక్నాలజీ వినియోగంలోకి రావడానికి ఆలస్యం అవుతోంది. కారణం పరికరాలు లభ్యం కాకపోవడం ప్రధాన సమస్య. ఎక్కువ మంది వినియోగదారులు 4జీ సేవల కోసం సిద్దంగా లేకపోవడం మరో కారణమని నిపుణులు తెలుపుతున్నారు.