మొబైల్ బ్యాంకింగ్లోకి ఏపీ గ్రామీణ వీకాస్ బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఆవిష్కరించింది. నెఫ్ట్ విధానంలో ఖాతాదారులు ఇతర బ్యాంకు ఖాతాకు సులభంగా నగదు బదిలీ చేయవచ్చు. ఖాతా బ్యాలెన్స్, అయిదు లావాదేవీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ సేవలను 2016 సెప్టెంబర్ నాటికి 2 లక్షల మంది కస్టమర్లకు చేరువ చేయాలని ఏపీజీవీబీ లక్ష్యంగా చేసుకుంది. అలాగే ఈ సంఖ్యను వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షలకు చేర్చాలని కృతనిశ్చయంతో ఉంది. శనివారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్‌బీఐ రూరల్ బిజినెస్ సీజీఎం కె.ఎం.త్రివేది, ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.