‘బ్రిక్స్ బ్యాంకు’ తొలి ప్రాజెక్టు ప్రారంభం
బీజింగ్: భారత్ సహా బ్రిక్స్ దేశాల ఆధ్వర్యంలో ఏర్పాటైన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారంతో మొట్టమొదటి ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించింది. షాంఘై లింగాంగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు 17 ఏళ్ల కాలానికి గాను 76 మిలియన్ డాలర్లు (రూ.486 కోట్లు) రుణం ఇచ్చేందుకు 2016 డిసెంబర్‌లో ఒప్పందం జరిగింది. ఎన్‌డీబీ నుంచి ఆర్థిక సహకారం అందుకున్న తొలి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా లింగాంగ్ పారిశ్రామిక ప్రాంతంలో 100 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో పరిశ్రమల పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో తొలి దశ శనివారం ప్రారంభమైంది. ఎన్‌డీబీని బ్రిక్స్ దేశాలు 2015లో ఏర్పాటు చేశాయి.