బడ్జెట్ లో మలివిడత సంస్కరణలు: జైట్లీ
న్యూఢిల్లీ: పన్నుల విధానంలో స్థిరత్వం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 2015-16 బడ్జెట్ లో రెండో తరం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. 365 రోజులు సంస్కరణలు కొనసాగుతాయని, వీటి గురించి ప్రముఖంగా ప్రస్తావించడానికి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం అనువైనదని అభిప్రాయపడ్డారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సబ్సిడీలను క్రమబద్దం చేస్తామని చెప్పారు. సంపన్నులకు సబ్సిడీపై ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లు లేనట్టేనని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6 శాతం దాటుతుందన్న ఆశాభావాన్ని అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు.