సాక్షి, ముంబై: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ క్యూ2 లో నికర లాభాల్లో క్షీణతను నమోదు చేసింది. జూన్ నెలాఖరుకు ముగిసిన రెండవ త్రైమాసికంలో నికరలాభం 2.97 శాతం తగ్గి 456 మిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో 470 మిలియన్ డాలర్లుగా నమోదయిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆదాయంలో పుంజుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 3.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 9.2 శాతం ఎగిసి 4 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. మూడో త్రైమాసికంలో సంస్థ 4.06 బిలియన్ డాలర్ల నుంచి 4.10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేసింది. నికర-ఆపరేటింగ్ విదేశీ మారకం నష్టాలు ,రూపాయి విలువ గత సంవత్సరంతో పోల్చితే తమ లాభాలను దెబ్బతీసిందని కాగ్ని జెంట్‌ఫలితాల సందర్భంగా వెల్లడించింది. అయితే వచ్చే ఏడాది ఆదాయంలో మరింత పుంజుకోనుందనే ధీమాను కంపెనీ సీఈవో వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment